: 11 చార్జిషీట్లలో ముద్దాయి సభ్యుడైనందుకు సిగ్గుపడుతున్నా: అచ్చెన్నాయుడు
వైకాపా అధినేత, సభలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 11 చార్జిషీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి సభలో సభ్యుడైనందుకు తాను సిగ్గుపడుతున్నానని ఆయన అన్నారు. హుదూద్ పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్న వారిని ఏమనాలో కూడా తెలియడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో హుదూద్ తుపానుపై జరిగిన చర్చలో భాగంగా అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది.