: తెలంగాణ వాటర్ గ్రిడ్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపలేదట!
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో హడావుడి తప్ప సక్రమ కార్యాచరణ ఉండటం లేదని విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి అది నిజమే అనిపిస్తుంది. వివరాల్లోకి వస్తే, తెలంగాణ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమం కోసం రూ. 28 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇందులో కొంత మేర కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం... నిధుల సహాయం కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని తెలిపింది.