: పెషావర్ దాడి ఎఫెక్ట్... జనవరి 3 దాకా లాహోర్ లో విద్యాలయాల మూత


పెషావర్ లోని సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు జరిపిన దాడి ప్రభావం ఆ దేశం మొత్తం మీద పడుతోంది. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో లాహోర్ లోని విద్యాలయాలన్నీ మూత పడ్డాయి. నగరంలోని పాఠశాలలతో పాటు కళాశాలలన్నింటికీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వచ్చే నెల 3 దాకా పాఠశాలలన్నింటినీ మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెషావర్ తరహాలోనే లాహోర్ లోని విద్యాలయాలపైనా తాలిబన్లు దాడులు చేయనున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News