: రెండు టీమ్ లు 109.4 ఓవర్లకే ఆలౌట్ అయ్యాయి... ఆసీస్ లీడ్ 97 రన్స్
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 505 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో, కీలకమైన 97 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆసీస్ టెయిలెండర్లను ఔట్ చేయడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరి వికెట్ గా స్టార్క్ 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. 11వ నెంబర్ బ్యాట్స్ మెన్ గా క్రీజులోకి వచ్చిన హ్యాజిల్ వుడ్ 32 పరుగులతో నాటౌట్ గా నిలవడం గమనార్హం. ఈ మ్యాచ్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... రెండు టీమ్ లు సరిగ్గా 109.4 ఓవర్లకే ఆలౌట్ అయ్యాయి. తొలి ఇన్నింగ్స్ లో 97 పరుగుల ఆధిక్యాన్ని సాధించడంతో... ఆస్ట్రేలియా జట్టు పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఈ స్కోరును సమం చేసి, ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలంటే భారత్ టాప్ ఆర్డర్ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం అటూ ఇటూ అయినా... రేపు సాయంత్రానికే మ్యాచ్ ముగిసిపోవచ్చు.