: స్వీడన్లో సత్తా చాటుతున్న భారత టెక్కీలు
భారత సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు స్వీడన్ మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. 2009-13 మధ్య కాలంలో 9366 మంది భారత పౌరులకు స్వీడన్ ప్రభుత్వం వర్క్ పర్మిట్లు జారీచేయగా, అందులో 8803 మంది ఐటీ నిపుణులే ఉండటం విశేషం. స్వీడన్ సాంకేతికరంగంపై ఇప్పటికే భారత టెక్కీలు తమదైన ముద్ర వేశారు. మెరుగైన పనితీరుతో కస్టమర్లకు సేవలందిస్తున్నారని స్టాక్ హోం బిజినెస్ రీజియన్ సీఈవో ఒలోఫ్ జెటెర్ బర్గ్ తెలిపారు. వినియోగదారులను సంతృప్తిపరచడంలో ఇతర కంపెనీలతో పోలిస్తే భారతీయ కంపెనీలు ముందునిలుస్తున్నాయని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి సైతం భారత టెక్కీలకు సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు.