: దేశవ్యాప్తంగా గాడ్సే ప్రతిమలు నిలబెట్టాలట!


మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటున్న వారిలో అఖిల భారత హిందూ మహాసభ కూడా చేరింది. ఈ సభ జాతీయ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌశిక్ ఢిల్లీలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ, దేశంలోని అన్ని నగరాల్లో గాడ్సే ప్రతిమలు నిలబెట్టాలని అన్నారు. ఎంతోమంది హిందువులను చంపిన ఔరంగజేబ్ పేరిట దేశంలో కొన్ని రోడ్లు ఉన్నాయని, అలాంటప్పుడు, గాడ్సే విగ్రహాలు ఎందుకు నిలబెట్టకూడదని ప్రశ్నించారు. కేంద్రం తమ ప్రతిపాదనకు నిరాకరిస్తే, తామే అన్ని రాష్ట్రాల్లోని హిందూ మహాసభ కార్యాలయాల్లో గాడ్సే ప్రతిమలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. స్వతంత్రం కోసం పోరాటంలో స్వల్ప పాత్ర పోషించిన గాంధీలా కాకుండా, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన దేశభక్తుడు గాడ్సే అని కౌశిక్ అభివర్ణించారు. ఉన్నావో ఎంపీ సాక్షి మహారాజ్ ఇటీవల గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించి, ఆ తర్వాత ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకున్న నేపథ్యంలోనే తమకు గాడ్సే ప్రతిమల ఏర్పాటు ఆలోచన వచ్చిందని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News