: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన భారతీయుడికి సింగపూర్ లో జైలు శిక్ష
లిఫ్ట్ లో ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన భారతీయుడు సత్తయ్య ఇళయరాజాకు సింగపూర్ కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించింది. గడచిన నవంబర్ 7వ తేదీన ఓ అపార్ట్ మెంట్ లోని లిఫ్ట్ లో తనతో పాటు వస్తున్న మహిళ పట్ల సత్తయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె లిఫ్ట్ లో నుంచి బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. వాదోపవాదాలు విన్న కోర్టు నిందితుడికి 9 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించినట్టు నేడు స్ట్రెయిట్స్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.