: స్టీవెన్ స్మిత్ సెంచరీ... భారత్ కు దీటుగా బదులిస్తున్న ఆసీస్


బ్రిస్బేన్ లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు దీటుగా ఆస్ట్రేలియా ఆడుతోంది. తొలి ఇన్నింగ్సులో భారత్ 408 పరుగులు చేయగా... ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు. క్లార్క్ స్థానంలో జట్టు నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన స్టీవెన్ స్మిత్ జట్టును ముందుండి నడిపించాడు. ఈ క్రమంలో అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 147 బంతులు ఆడిన స్మిత్ 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఫోర్ తో స్మిత్ శతకాన్ని పూర్తి చేయడం గమనార్హం. కెప్టెన్ గా తొలి టెస్టులోనే స్మిత్ సెంచరీ చేశాడు. మరోవైపు మిచెల్ జాన్సన్ 62 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్సులో ఆసీస్ మరో 68 పరుగులు వెనుకబడి ఉంది.

  • Loading...

More Telugu News