: భారత్ లో కూడా మైనస్ 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది
అతి శీతల దేశాల్లో నమోదయ్య ఉష్ణోగ్రతలు భారత దేశంలో కూడా నమోదవుతున్నాయి. జమ్మూకాశ్మీర్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా శీతాకాలంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే లేహ్ లో ఈ ఏడాది మైనస్ 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం రికార్డు. కార్గిల్ పట్టణంలో మైనస్ 14.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీనగర్ లో మైనస్ 4.2 డిగ్రీలు, గుల్మార్గ్ లో మైనస్ 2.2 డిగ్రీలు, పహల్గాంలో మైనస్ 6.6 డిగ్రీలు, జమ్మూ నగరంలో 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పడిపోయిన ఉష్ణోగ్రతలకు తోడు చలిగాలులు, కురుస్తున్న మంచు కారణంగా దైనందిన జీవనం దుర్భరంగా తయారైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.