: అంజన్ కుమార్ యాదవ్ కుమారుడి అరెస్టు, విడుదల
సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ను నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. అడిక్ మెట్ ప్రాంతంలో అయ్యప్ప పూజకు అనిల్ కుమార్ యాదవ్ మరికొంత మందితో కలిసి వెళ్లారు. అదే సమయంలో అడిక్ మెట్ ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ యాదవ్, అతడి మామ శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చారు. పూజ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో అందరినీ అరెస్టు చేసిన పోలీసులు, వారు రాజీకి రావడంతో స్టేషన్ బెయిల్ పై వారిని విడుదల చేశారు.