: హెచ్ఐవీ చిన్నారిని బహిష్కరించాలని మెజార్టీ గ్రామస్తుల ఓటింగ్!


ఎయిడ్స్ రోగుల పట్ల ప్రజలకు గల అపోహలు, వివక్ష ఎంత తీవ్రంగా ఉంటున్నాయో తెలిపే ఉదంతమిది. హెచ్ఐవీ సోకిన ఓ చిన్నారిని గ్రామం నుంచి బహిష్కరించాలా? వద్దా? అనే విషయమై గ్రామ పెద్దలు వోటింగ్ పెట్టారట. గ్రామంలోని 200 మంది వెళ్లగొట్టేందుకే మొగ్గు చూపారు. ఈ ఘటన చైనాలో జరిగింది. బాలుడిని గ్రామం నుంచి వెళ్ళగొట్టడానికి పిటిషన్ పై సంతకాలు చేసిన వారిలో అతని తాత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కున్‌ కున్ అనే పేరున్న ఈ బాలుడు ఇతర పిల్లలు తనతో ఆటలాడరని, స్కూల్లోకి కూడా రానివ్వరని వాపోతున్నాడు.

  • Loading...

More Telugu News