: హైదరాబాదులో 'న్యూ ఇయర్' వేడుకలకు పోటీపడుతున్న ఈవెంట్ సంస్థలు


న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాదు సన్నద్ధమవుతోంది. కొత్త సంవత్సర వేడుకలకు ఊపునిచ్చేందుకు ఈవెంట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. హైదరాబాదులోని స్టార్ హోటళ్లు, రిసార్టులు, ఫుడ్ కోర్టులు ప్రత్యేక సందడి పేరిట పలు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాయి. తమ కార్యక్రమాలకు ప్రత్యేక అతిథులు, నర్తకులుగా సినీ నటులతో ఒప్పందాలు చేసుకుని తమ గొప్పదనాన్ని నిరూపించుకుంటున్నారు. ఆర్ఎస్ హెచ్ ఈవెంట్స్ మేనేజ్ మెంట్ శృంగారతార సన్నీ లియోన్ తో ఒప్పందం చేసుకుని రసికరాజులను సంతృప్తిపరచనుండగా, బాలీవుడ్ నటీనటులతో మరిన్ని ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులతో పాటు సౌండ్ అందించేందుకు పలువురు పేరున్న డీజేలను కూడా ఈవెంట్ సంస్ధలు ఎంపికచేసుకుంటున్నాయి. దీంతో న్యూ ఇయర్ ఈవెంట్ లపై పార్టీ సర్కిల్స్ లో అప్పుడే చర్చ ప్రారంభమైంది. దీంతో నగరంలో జరిగే న్యూఇయర్ ఈవెంట్ లకి హాజరయ్యేందుకు యువకులు ఉత్సాహం చూపుతున్నారని వారు పేర్కొంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులతో జరగనున్న నూతన సంవత్సర వేడుకలు చలిలో వేడిపుట్టించనున్నాయి.

  • Loading...

More Telugu News