: ప్రేమించానని చెప్పి... బావిలో తోసి... యువకుడి ఆత్మహత్య


ప్రేమించానని వెంటపడ్డాడు. నమ్మించి వెంట తీసుకెళ్ళాడు. ప్రాణాలు తీయబోయి తనే మృతి చెందాడు. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మూల్పూరులో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రేమించానంటూ ఓ బాలికను నమ్మించి, ఆమెను బావిలోకి తోసి, అ వెంటనే తనూ దూకాడు ఓ యువకుడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన బాలిక పోలీసులకు సమాచారం చేరవేసింది. అదే బావిలో యువకుడి మృతదేహం లభ్యం కావడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News