: విష్ణు అరెస్ట్ కు రంగం సిద్ధం... అజ్ఞాతంలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే!


కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై దాడి కేసుకు సంబంధించి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు మాదాపూర్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు నేటి ఉదయం విష్ణు నివాసానికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో విష్ణు ఇంట్లో లేరు. మరోవైపు ఆయన రెండు సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, విష్ణు రంగారెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన తరువాత తప్పు విష్ణుదేనని తేలడంతో ఆయన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News