: అంగారక గ్రహంపై నీటిజాడ
అంగారకుడిపై నీటిజాడ పసిగట్టామని లండనులోని గ్లాస్గో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంటున్నారు. కుజగ్రహం నుంచి వెలువడ్డ నఖ్లా గ్రహశకలంపై జరిపిన పరిశోధనలో అక్కడి ఉపరితలంపై నీరింకినట్లుగా ప్రాధమిక ఆధారాలను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనితో కుజగ్రహంపై జీవనానికి అనువైన వాతావరణం ఉందన్న విషయం తేలేందుకు మరెంతో కాలం పట్టదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దాదాపు పది మిలియన్ సంవత్సరాల కిందట కుజగ్రహంలో పెద్ద విస్పోటనం జరిగింది. ఆ భారీ పేలుడు ధాటికి అంగారక గ్రహానికి చెందిన ఓ గ్రహశకలం భూమిపైకి దూసుకొచ్చి, 1911 సంవత్సరంలోఈజిప్ట్ లోని నఖ్లా అనే ప్రాంతంలో పడింది. అందుకే ఈ గ్రహశకలానికి నఖ్లా శకలం పేరు పెట్టారు. అయితే ఈ గ్రహశకలంలోని చిన్న భాగం (1.7 గ్రా)పై పరిశోధించిన శాస్త్రవేత్తల బృందం..అక్కడ నీటి ఆనవాళ్లు ఉన్నాయన్న విషయంపై పూర్తిగా నిర్థారణకు రావడానికి మరికొంత సమయం పడుతుందంటున్నారు.