: మరోసారి చొరబడ్డ తీవ్రవాదులు


జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోకి నేటి ఉదయం తీవ్రవాదులు చొరబడ్డారు. సమాచారం అందుకున్న సైన్యం వారిని హతమార్చేందుకు రంగంలోకి దిగింది. కుప్వారా జిల్లాలోని బాజ్పోరా ప్రాంతంలో తీవ్రవాదుల ఏరివేతకు తనిఖీలు చేపట్టగా, విషయాన్ని గమనించిన తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత సైనికులు తీవ్రవాదులపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఎన్ కౌంటర్ లో భాగంగా, ఒక తీవ్రవాదిని హతమార్చామని, ఈ ప్రాంతంలో ఇంకెవరైనా తీవ్రవాదులు ఉన్నారా? అనే కోణంలో తనిఖీలు కొనసాగిస్తున్నామని ఓ సైన్యాధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News