: చనిపోయే ముందు కుక్కకు డబ్బింగ్ చెప్పిన హాలీవుడ్ నట దిగ్గజం


ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ తను ఆత్మహత్య చేసుకునే ముందు 'ఆబ్సల్యూట్లీ ఎనీథింగ్' అనే చిత్రంలో నటించిన ఓ శునకానికి డబ్బింగ్ చెప్పారు. సైన్స్ ఫిక్షన్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. చిత్రంలో డెన్నిస్ అనే పేరున్న కుక్కకు, దాని యజమానికి మధ్య జరిగే సంఘటనలు ప్రేక్షకులను అలరిస్తాయని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలో సైమన్ పెగ్గ్, ఓవెన్ విల్సన్, బెన్ కింగ్స్ లే, ఆర్ విల్సన్, బెన్ స్టిల్లర్ తదితరులు నటించారు. కాగా, రాబిన్ విలియమ్స్ ఈ సంవత్సరం ఆగస్టు 11న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News