: 'పెషావర్' కిరాతకుల ఫొటోలు విడుదల చేసిన తాలిబన్లు
పాకిస్థాన్ లో నరమేధం సృష్టించిన తాలిబన్లు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. పెషావర్ సైనిక పాఠశాలపై దాడి చేసి 132 మంది చిన్నారులు సహా మొత్తం 148 మందిని పొట్టనబెట్టుకున్న కిరాతకుల ఫొటోలను సగర్వంగా విడుదల చేశారు. తమ యోధుల కుటుంబాలను, వారి చిన్నారులను పాక్ సైన్యం ఎంతోకాలం నుంచి చంపేస్తోందని, అందుకు ప్రతిగానే ఈ దాడి చేశామని పాకిస్థాన్ తాలిబన్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాలిబన్ల ప్రతినిధి మహ్మద్ ఖురసాని మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. సైనిక సంస్థల నుంచి వెళ్లిపోవాలని పౌరులకు సూచించారు. లేకుంటే, దాడుల్లో వారూ బలవుతారని స్పష్టం చేశారు.