: మెదక్ జిల్లాను మూడు జిల్లాలు చేస్తాం: కేసీఆర్


పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా విడగొడతామని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జిల్లా కేంద్రానికి మిగిలిన ప్రాంతాలు చాలా దూరంగా ఉన్న నేపథ్యంలో, జిల్లాలు మూడుగా విభజించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ప్రస్తుత మెదక్ జిల్లా మెదక్ కేంద్రంగా కొనసాగుతుందని అన్నారు. జిల్లాలో ఉన్న సంగారెడ్డి, సిద్దిపేటలను రెండు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సిద్దిపేటను జిల్లా చేయాల్సిన అవసరం ఉందని... కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేసినా వెనకడుగు వేయమని వెల్లడించారు.

  • Loading...

More Telugu News