: అత్తింటి వేధింపులపై చక్రి భార్య మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు!
గుండెపోటుతో సినీ సంగీత దర్శకుడు చక్రి కన్నుమూయడం తెలిసిందే. కాగా, ఆయన భార్య శ్రావణిని అత్తింటి వారు వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తరపున మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు దాఖలైంది. మానసికంగా తనను వేధిస్తున్నారని, చక్రిని చంపే ప్రయత్నం చేశావంటూ ఆరోపిస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్టు సమాచారం. తాజాగా, మీడియాతో మాట్లాడిన శ్రావణి, 11 రోజుల తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని, ముందు చక్రి కర్మకాండలు పూర్తవ్వాలని చెప్పారు. ఇప్పుడు తానేమీ మాట్లాడలేనని, తన ఆరోగ్యం బాగా లేదని, చేతులు జోడించి మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. వేధింపులకు గురయ్యారా? అన్న ప్రశ్నకు కన్నీళ్లతో బదులిస్తూ, దేవుడికే తెలియాలన్నారు.