: మనోజ్ తివారీ ప్రేమకు 'నో అబ్జెక్షన్' చెప్పిన వెంకయ్య నాయుడు


చమత్కారంగా మాట్లాడడంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దిట్ట. లోక్ సభలో ఆయన ప్రేమలేఖల విషయం చెప్పి అందరినీ నవ్వించారు. విషయం ఏమిటంటే... ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణకు సర్కారు బిల్లు తెచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడి కృషి ఉంది అందులో. దీనిపై వెంకయ్యకు కృతజ్ఞతలు చెబుతూ భోజ్ పురి నటుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఓ పాటందుకున్నారు. "వెంకయ్యజీ ఐ లవ్యూ" అంటూ పాడడంతో, వెంకయ్య స్పందించారు. మనోజ్ తివారీ ప్రేమకు 'నో అబ్జెక్షన్' చెప్పారు. "నాకిప్పటికీ ప్రేమలేఖలు వస్తుంటాయి, అయినా, నా భార్య అవేవీ పట్టించుకోదు" అని వెంకయ్య సరదాగా చెప్పడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. మధ్యలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకుని, "మీ మనసులో అలాంటి ఆలోచన ఉందేంటి?" అని ప్రశ్నించారు. అందుకు, వెంకయ్య చురుగ్గా స్పందిస్తూ, "నా మనసులో ఎలాంటి ఆలోచన లేదు, మీ మనసులో ఏమైనా ఉంటే తొలగించుకోండి" అని అన్నారు.

  • Loading...

More Telugu News