: పాక్ తాలిబన్లపై అమెరికా డ్రోన్ దాడి... 11 మంది ఉగ్రవాదుల హతం


తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ మిలిటెంట్లపై డ్రోన్లతో అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం జరిగింది. దాడుల వివరాలను ఈ రోజు వెల్లడించారు. ఓ వాహనంలో వెళుతున్న ఉగ్రవాదులపై డ్రోన్ దాడి చేసిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News