: ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం: పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు
ప్రజల పక్షాన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైకాపా అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేడు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళల పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఐకేపీ ఉద్యోగులు, అంగన్ వాడీల సమస్యలపైనా గళమెత్తుదాం. ఇసుక మాఫియా, హుదూద్ తుపాను, శ్రీశైలం జలవివాదం, పోలవరం, రాజధాని అంశం, రైతుల ఆత్మహత్యలపై సర్కారును నిలదీద్దాం. అసెంబ్లీలో మన పోరాటం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ప్రజా సమస్యలపై సిద్ధమై రండి’’ అంటూ ఎమ్మెల్యేలకు సూచించారు.