: ఒబామా పర్యటన సమయంలో ఉగ్రవాదులు దాడి చేయవచ్చు: ఇంటెలిజెన్స్ హెచ్చరిక
లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలో దాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించాయి. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా ఈ దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సమాచారం అందించింది. జనవరి నెలాఖరు వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అక్టోబర్ లో మధ్యప్రదేశ్ లోని ఓ జైలునుంచి తప్పించుకున్న ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను ఇంతవరకు గుర్తించని నేపథ్యంలో తాము ప్రత్యేక దృష్టి పెడుతున్నామని నిఘావర్గాలు చెబుతున్నాయి. తప్పించుకున్న వారితో లష్కర్ సంస్థ నిర్వాహకులు దాడి గురించి మాట్లాడినట్టు ఫోన్ కాల్స్ డేటా ద్వారా బహిర్గతమైందని తెలిపారు.