: మురళీ విజయ్ ఔట్... భారీస్కోరు దిశగా టీమిండియా
బ్రిస్బేన్ లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. సెంచరీ పూర్తి చేసుకున్న టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ 144 వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. తొలి టెస్టులో వికెట్ల వీరుడిగా నిలిచిన ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ మురళిని ఔట్ చేశాడు. లియాన్ బౌలింగ్ లో బ్రాడ్ హాడిన్ పట్టిన క్యాచ్ తో మురళి పెవిలియన్ చేరాడు. మరోవైపు, అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే (73)తో జతకలిసిన టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ ధాటిగా ఆడుతున్నాడు. 31 బంతుల్లోనే అతడు 25 పరుగులు సాధించాడు. మురళి సెంచరీ, రహానే అర్ధ సెంచరీ, రోహిత్ దూకుడు బ్యాటింగ్ కారణంగా టీమిండియా భారీస్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం 82 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 308 పరుగులు చేసింది.