: లోటస్ పాండ్ లో వైఎస్సార్సీఎల్పీ భేటీ ప్రారంభం


ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీకి చెందిన శాసనసభ సభ్యులు, మండలి సభ్యులు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో అధినాయకత్వంతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వ్యవహరించాల్సిన తీరుపై ప్రస్తుతం చర్చ నడుస్తున్నట్లు సమాచారం. పార్టీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీకి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. సమావేశాల్లో భాగంగా ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయడం, తమపై చేసే వ్యక్తిగత ఆరోపణలను ఎదుర్కోవడం వంటి విషయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News