: కోహ్లీ ఔట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 27 బంతుల్లో 19 పరుగులు చేసిన టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, జోష్ హాజెల్ ఉడ్ బౌలింగ్ లో బ్రాడ్ హాడిన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు చేసిన కోహ్లీ, రెండో టెస్టులో విఫలమయ్యాడు. టీమిండియా స్కోరు 137 పరుగుల వద్ద కోహ్లీ ఔటయ్యాడు. దీంతో, అజింక్యా రహానే విజయ్ కి జతకలిశాడు. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న విజయ్ 141 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఇప్పటిదాకా నేలకూలిన టీమిండియా బ్యాట్స్ మెన్ ఆసీస్ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగినవారే కావడం విశేషం!