: రేపు పాకిస్థాన్ అఖిలపక్షం కీలక సమావేశం
పెషావర్ సైనిక ఆసుపత్రిలో మారణహోమానికి పాల్పడి, 160 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఇక పాకిస్థాన్ పరిస్థితైతే ఇంకా దారుణంగా ఉంది. మెజారిటీ పాకిస్థానీలు భయంతో వణుకుతున్నారు. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ పార్లమెంటరీ పార్టీలతో అఖిలపక్ష సమావేశం జరపాలని ప్రధాని నవాజ్ షరీఫ్ నిర్ణయించారు. రేపు ఉదయం 11 గంటలకు పెషావర్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదానికి సంబంధించి కీలక చర్చలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.