: విషమంగానే దర్శకుడు బాలచందర్ ఆరోగ్యం
ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆయనకు చికిత్స అందిస్తున్న చెన్నైలోని కావేరి ఆసుపత్రి డైరెక్టర్ వెంకటాచలం తెలిపారు. మూత్రపిండాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నారని... డయాలసిస్ చికిత్సలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం బాలచందర్ స్పృహలోనే ఉన్నారని... చికిత్సకు సహకరిస్తున్నారని వెల్లడించారు.