: 130కి చేరిన మృతుల సంఖ్య... ఐదో ఉగ్రవాది హతం
పాక్ లోని పెషావర్ లో ఉన్న సైనిక పాఠశాలలో పాక్ తాలిబన్లకు, సైన్యానికి మధ్య ఏడు గంటల నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. తాలిబన్ల దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 130కి చేరుకుంది. ఈ క్రమంలో మరో ఉగ్రవాదిని పాక్ సైన్యం మట్టుబెట్టిందని మిలిటరీ అధికారి ఆసిం భజ్వా తెలిపారు. దీంతో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారని చెప్పారు. ఇదే సమయంలో మరో ఇద్దరు పిల్లలను, ఇద్దరు స్కూల్ సిబ్బందిని రక్షించామని వెల్లడించారు.