: తీవ్రవాదాన్ని నిర్మూలించేదాకా యుద్ధం ఆగదు: నవాజ్ షరీఫ్


పెషావర్ లోని సైనిక పాఠశాలపై దాడి చేసి ఇప్పటి దాకా 126 మందిని హతమార్చిన పాక్ తాలిబన్ చర్యలను పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు. ఉగ్రవాదులపై పాక్ సైన్యం చేస్తున్న దాడులకు ప్రతీకారంగా వారు ఈ ఘటనకు పాల్పడ్డారని షరీఫ్ అన్నారు. ఈ దేశం నుంచి తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు మన యుద్ధం ఆగదని చెప్పారు. ఇదే విషయంపై ఆఫ్ఘనిస్తాన్ తో కూడా మాట్లాడామని... కలసికట్టుగా ఉగ్రవాదంపై పోరాటం సాగిద్దామని చెప్పామని తెలిపారు. ఇలాంటి సమయంలో దేశం తన శక్తిని, ధైర్యాన్ని కోల్పోరాదని అన్నారు.

  • Loading...

More Telugu News