: పాక్ లో ఉగ్రవాదుల దాడులను ఖండించిన హోం మంత్రి రాజ్ నాథ్
పాకిస్థాన్ లోని పెషావర్ నగరంలో ఆర్మీ స్కూల్ పై దాడి చేసిన పాక్ తాలిబాన్లు కిరాతకానికి ఒడిగట్టారు. విద్యార్థులు, సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటిదాకా 104 మంది చనిపోయినట్టు సమాచారం. ఇందులో 84 మంది విద్యార్థులని తెలుస్తోంది. చిన్నారులపై ఉగ్రవాదుల చర్యలను భారత హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చర్యలు అమానవీయ, పాశవికమైనవిగా ఆయన అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.