: ప్రియాంక చోప్రా దత్తత చేసుకున్న పులి చచ్చిపోయింది!
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 2011లో ఓ ఆడపులిని దత్తత చేసుకుంది. దుర్గా అనే పేరు గల ఆ పులి వయసు పదకొండేళ్లు. అయితే, రాంచీలోని బిర్సా ముండా జూలాజికల్ పార్క్ లో అది సోమవారం నాడు మరణించింది. దాన్ని 2007లో కర్ణాటకలోని షిమోగా నుంచి తీసుకువచ్చారు. టాక్సేమియా (రక్తం విషపూరితంగా మారడం) కారణంగా ఆ పులి మరణించినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. బిర్సా ముండా జూలో గత ఏడేళ్లలో 8కి పైగా పులులు మృత్యువాత పడ్డాయి. 2010లో మూడు పులి పిల్లలు చనిపోయాయి. ప్రస్తుతం అక్కడ శివ, సుగ్రీవ్, తేజస్విని అనే పులులు మాత్రమే ఉన్నాయట. కాగా, 2012లో ప్రియాంక చోప్రా 'దుర్గ' సంరక్షణ కోసం జూ వర్గాలకు రూ.2 లక్షలు విరాళంగా అందించారు. అప్పట్లో 'సేవ్ టైగర్' ప్రచార కార్యక్రమంలో భాగంగా సినీ తారలు, క్రికెటర్లు పెద్ద ఎత్తున పులులను దత్తత చేసుకున్నారు.