: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుమానాస్పద బ్యాగు... హై అలర్ట్ ప్రకటన
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం పార్కింగ్ పికప్ పాయింట్ వద్ద ఉన్న ఈ బ్యాగు కలకలం రేపింది. దీంతో, హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం పార్కింగ్ పికప్ పాయింట్ వద్ద బాంబు స్క్వాడ్ నిశితంగా తనిఖీలు చేస్తోంది. అటు, ఎయిర్ పోర్టులోనూ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.