: మహిళల్లో గుండెపోటుకు, నెలసరి సమస్యలకు సంబంధం... ఆక్స్ ఫర్డ్ అధ్యయనం


మహిళల్లో నెలసరి సమస్యలతో గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. సుమారు 10 లక్షల మందికి పైగా మహిళలను భాగం చేస్తూ యూనివర్సిటీ అఫ్ ఆక్స్ ఫర్డ్ ఓ అధ్యయనం చేసింది. 10 సంవత్సరాలలోపే బాలికలకు నెలసరి ప్రారంభమైనా, 17 సంవత్సరాల తరువాత నెలసరి మొదలైనా, వారిలో గుండె సంబంధిత రోగాల రిస్క్ అధికమని తెలిపింది. వీరిని అధిక రక్తపోటు సమస్యలు వెంటాడుతాయని పేర్కొంది. తమ అధ్యయనం ప్రకారం బాలికల్లో 13 సంవత్సరాలకు రజస్వల అయ్యేవారు మిగతా వారితో పోలిస్తే గుండె జబ్బులకు దూరంగా ఉంటారని అధ్యయన రూపకర్త డెక్స్ టర్ కానోయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 50 నుంచి 64 ఏళ్ల మధ్య ఉన్న 13 లక్షల మంది నుంచి సమాచారాన్ని సేకరించినట్టు వివరించారు. చిన్న వయసులో బాలికల స్థూలకాయం తరువాతి కాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News