: మంచు గుప్పిట్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్... కిలాంగ్ లో -9.6 డిగ్రీల ఉష్ణోగ్రత
ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మంచు గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా రెండు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. రవాణా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని రోజులుగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, నేడు కిలాంగ్ పరిధిలో అత్యల్పంగా -9.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో, అక్కడి ప్రజలు ఇళ్లలోనే బందీలుగా మారారు! బయటకు వచ్చేందుకు ఏ ఒక్కరు కూడా సాహసించడం లేదు.