: తుమ్మలకు రోడ్లు, భవనాలు... తలసానికి పర్యాటక శాఖ?


తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్ లో కొద్దిసేపటి క్రితం చేరిన కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు దాదాపుగా పూర్తయింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశం అనంతరం కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖను కేటాయించనున్న కేసీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ బాధ్యతలను అప్పగించనున్నారు. ఇంద్రకరణ్ రెడ్డికి న్యాయ, గృహనిర్మాణం.. జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖ దక్కనున్నాయి. లక్ష్మారెడ్డికి విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్న సీఎం, చందూలాల్ కు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News