: నిర్భయ ఘటనకు నేటితో రెండేళ్లు... తలచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతోందంటున్న మహిళలు!


దేశ రాజధాని ఢిల్లీలో 'నిర్భయ' ఘటన జరిగి నేటికి సరిగ్గా రెండేళ్లు. 2012 డిసెంబర్ 16న తన స్నేహితుడితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతిపై కొందరు దుండగులు అతి పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడగా, తీవ్ర గాయాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. బస్సు డోర్లు మూసేసి, కదులుతున్న బస్సులో దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సుమారు 2 వారాల పాటు మృత్యువుతో పోరాడిన 'నిర్భయ' డిసెంబర్ 29న మృతి చెందింది. దుండగుల అరాచకాన్ని ధైర్యంగా ప్రతిఘటించిన యువతిని 'నిర్భయ'గా కీర్తిస్తూ, ఆమెకు మద్దతుగా దేశ యువత, ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలను చేపట్టగా, అప్పటి యూపీఏ ప్రభుత్వం మాజీ చీఫ్ జస్టిస్ జే.ఎస్.వర్మ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం మొదటిసారిగా అత్యాచారానికి పాల్పడితే 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష. అదే రెండోసారి పాల్పడితే ఉరిశిక్షను విధించవచ్చు. కాగా, నిర్భయ చట్టం వచ్చినా, మహిళలపట్ల నేరాలు మాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో మహిళలు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారు. నిర్భయ ఘటనను తలచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతోందని అంటున్నారు.

  • Loading...

More Telugu News