: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తలసాని తదితరులు
తెలంగాణ కేబినెట్ లో మంత్రులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపటి క్రితం రాజ్ భవన్ లో వీరితో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. సీఎం కేసీఆర్ సహా ఆయన కేబినెట్ సహచరులు, టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), తలసాని శ్రీనివాసయాదవ్ (హైదరాబాద్), ఇంద్రకరణ్ రెడ్డి(ఆదిలాబాద్), చందూలాల్ (వరంగల్), లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు (మహబూబ్ నగర్) ఉన్నారు.