: కేసీఆర్తో దోస్తీ కారణంగానే పదవి వచ్చింది: చందూలాల్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకు మంచి దోస్తీ ఉందని, అందువల్లే తనకు మంత్రివర్గంలో చోటు లభించిందని ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ తో కలసి పని చేసిన అనుభవం తనకు అదనపు అర్హతగా ఆయన వివరించారు. తెలంగాణ గిరిజనుల స్థితిగతులపై కేసీఆర్ కు మంచి అవగాహన ఉందని ఆయన అన్నారు. గిరిజనుడనైన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు కేసీఆర్ కు చందూలాల్ కృతజ్ఞతలు తెలిపారు. బంగారు తెలంగాణ సాధన దిశగా తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News