: చిల్లర రాజకీయాలు చేయబోనంటున్న తుమ్మల
తాను చిల్లర రాజకీయాలు చేసే వాడిని కాదని మాజీ మంత్రి, ఇటీవల టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలు చేయనని, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన తెలిపారు. కేసీఆర్ కేబినెట్లో తుమ్మల పేరు ఖరారైనట్టు తెలిసిందే. రాష్ట్ర మంత్రిగా నేడు ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తానని, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా తాను ముందుకు వెళతానని ఈ సందర్భంగా తుమ్మల చెప్పారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల ఓడిపోయిన సంగతి తెలిసిందే.