: పరారైన రిమాండ్ ఖైదీ సునీల్ అరెస్ట్


కడప సబ్ జైలు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ సునీల్ ను పోలీసులు ఎట్టకేలకు నేడు అరెస్ట్ చేశారు. అనంతపురం, కృష్ణా జిల్లా పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో సునీల్ పట్టుబడ్డాడు. మూడు రోజుల క్రితం అనంతపురం కోర్టులో జరిగిన విచారణకు హాజరైన తర్వాత తిరిగి కడప జైలుకు వచ్చిన సందర్భంగా అతడు పోలీసులకు మస్కా కొట్టి చాకచక్యంగా తప్పించుకున్నాడు. రెండు జిల్లాల పోలీసులు జరిపిన ఆపరేషన్ లో సునీల్ కృష్ణా జిల్లాలో పోలీసులకు దొరికిపోయాడు. 21 కేసుల్లో సునీల్ నిందితుడిగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News