: వెంకటరమణ భౌతికకాయానికి చంద్రబాబు నివాళి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వెంకటరమణ నేటి ఉదయం మరణించిన సంగతి విదితమే. చెన్నై నుంచి భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తిరుపతికి తీసుకొచ్చారు. ప్రకాశం జిల్లా కొండెపిలో రైతు సాధికారత సదస్సులో పాల్గొన్న అనంతరం తిరుపతికి చేరుకున్న సీఎం చంద్రబాబు, వెంకటరమణ భౌతికకాయానికి నివాళులర్పించారు. వెంకటరమణ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.