: మడోన్నా నా స్టైల్ ఐకాన్: సుస్మితాసేన్


పాప్ గాయని, నటి మడోన్నా తన స్టైల్ ఐకాన్ అని మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ అంటోంది. కోల్ కతాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ, "మడోన్నా అంటే చాలా ఇష్టం, తనే నా స్టైల్ ఐకాన్. ఎందుకంటే తన సంగీతమే తన స్టైల్ కు చిహ్నం" అని తెలిపింది. మనిషి ఎప్పుడైతే ప్రతి విషయంలో విజయం సాధిస్తాడో అప్పుడే మరింత స్టైల్ గా కనిపిస్తాడని అభిప్రాయపడింది. ఇక బెంగాలీ మాట్లాడేందుకు తాను చాలా ఇష్టపడతానని చెబుతోందీ 39 ఏళ్ల సుందరి.

  • Loading...

More Telugu News