: ఎల్పీజీ సిలిండర్ రాయితీకి ఆధార్ తప్పనిసరి కాదు : కేంద్రం


వంటగ్యాస్ సిలిండర్ రాయితీ మొత్తాన్ని బదిలీ చేసేందుకు ఆధార్ సంఖ్య తప్పనిసరికాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే బ్యాంకు ఖాతా తెరిచేందుకు మాత్రం తప్పక అవసరమని వెల్లడించింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు లోక్ సభలో మాట్లాడుతూ, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద ఎల్పీజీ వినియోగదారులు ఈ పథకంలో చేరితే మార్కెట్ రేటుకు అనుగుణంగా వంటగ్యాస్ ను పొందుతారని చెప్పారు. అంతేగాక ప్రతి ఒక్కరికీ తమ సిలిండర్ రాయితీ మొత్తం వారి ఖాతాల్లో బదిలీ అవుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆధార్ సంఖ్య లేకపోయినప్పటికీ రాయితీ మొత్తం ఖాతాల్లోకి జమవుతుందని వివరించారు. ఆధార్ సంఖ్యలేని కారణంగా రాయితీని తిరస్కరించమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News