: శూన్య స్థాయికి ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో నవంబర్ లో ద్రవ్యోల్బణం శూన్య స్థాయికి వెళ్లినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పడిపోవడం, ఆహార, తయారీ వస్తువుల ధరలు క్షీణించిన క్రమంలోనే ఈ స్థాయికి చేరినట్టు చెబుతున్నారు. టోకు ధరల ద్రవ్యోల్బణం సున్నా స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. ఇక అక్టోబర్ లో ద్రవ్యోల్బణం 1.77 శాతంగా నమోదైంది. అటు ఆహార ద్రవ్యోల్బణం దాదాపు మూడు సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయి 0.63 శాతంగా నమోదైంది.