: మోదీ సర్కారు ఆరెస్సెస్ ఎజెండాను అమలుచేస్తోంది: సి.రామచంద్రయ్య


ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు వ్యవహార సరళిపై కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన రామచంద్రయ్య, మోదీ సర్కారు జాతీయవాదాన్ని బలోపేతం చేస్తున్న వైనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లౌకికవాది అయిన పటేల్ ను పొగుడుతున్న మోదీ సర్కారు, పటేల్ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జాతీయవాదానికి మతం రంగు పులుముతోందని ఆయన ఆక్షేపించారు. పటేల్ ఆశయాలకనుగుణంగా ముందుకు సాగుతున్నామని చెబుతున్న బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్ అజెండాను భుజానికెత్తుకుంటోందని విమర్శించారు. దేశ సమగ్రతను కాపాడే విధంగా మోదీ సర్కారు నడచుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News