: విశాఖలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్


రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నేడు విశాఖకు వచ్చారు. భారత నావికా దళంలోని తూర్పు కమాండ్ ను పరిశీలించే నిమిత్తం ఆయన కొద్దిసేపటి క్రితం విశాఖ చేరుకున్నారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ పారికర్ ఇప్పటికే త్రివిద దళాల్లోని పలు ప్రధాన విభాగాలను పరిశీలించారు. జమ్మూ కాశ్మీర్ లోనూ ఆయన పర్యటించారు. తాజాగా తూర్పు నావికాదళాన్ని సందర్శించే నిమిత్తం ఆయన విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల తన అమ్ములపొదిలో చేరిన ఐఎన్ఎస్ అరిహంట్ ను ఇండియన్ నేవీ దిగ్విజయంగా పరీక్షించింది. నేటి ఉదయం గోవా నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో విశాఖ వచ్చిన ఆయన కొద్దిసేపట్లో న్యూఢిల్లీ వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News