: ఛత్తీస్ గఢ్ కుర్రాడికి గూగుల్ బొనాంజా
భారత ఐఐటీ విద్యార్థులకు ప్రస్తుతం మహర్దశ నడుస్తున్నట్టే భావించాలి. గూగుల్, ఫేస్ బుక్ వంటి దిగ్గజ సంస్థలు కోట్ల రూపాయల ప్యాకేజీలతో వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. తాజాగా, ఛత్తీస్ గఢ్ కు చెందిన గౌరవ్ అగర్వాల్ అనే విద్యార్థికి గూగుల్ ఏడాదికి రూ.1.7 కోట్లతో ఉద్యోగం ఆఫర్ చేసింది. గౌరవ్ ఐఐటీ ఇండోర్ లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. తొలుత ఆన్ లైన్ టెస్టు నిర్వహించారని, అందులో ఉత్తీర్ణత సాధించడంతో గుర్గావ్ లో ఆన్ సైట్ ఇంటర్వ్యూకు పిలిచారని గౌరవ్ తెలిపాడు. చివరగా బెంగళూరులో నిర్వహించిన ఇంటర్వ్యూతో ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, అనంతరం, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జాయిన్ అవ్వాలంటూ గూగుల్ నుంచి లేఖ వచ్చిందని వివరించాడు.