: ఢిల్లీ వీధులపై 'నేత్ర' ఓ కన్నేస్తాడు!


ఢిల్లీలో భద్రతకు పోలీసు విభాగం ఆధునిక విధానాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇకపై దేశ రాజధాని వీధుల్లో రాత్రివేళల్లో పెట్రోలింగుకు మానవ రహిత విమానాలను వినియోగిస్తారు. ఈ విమానాలను ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్డీవో, ముంబయికి చెందిన ప్రైవేటు సంస్థ 'ఐడియాఫోర్జ్' సంయుక్తంగా రూపొందించాయి. 'నేత్ర'గా నామకరణం చేసిన ఈ విమానానికి నైట్ విజన్ కెమెరాలు అమర్చుతారు. ఈ విమానాలను ఇప్పటికే బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు ఉపయోగిస్తున్నాయి. 2013లో ఉత్తరాఖండ్ వరదల సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లోనూ 'నేత్ర' విమానాలు పాలుపంచుకున్నాయి. అమీర్ ఖాన్ హిట్ సినిమా '3 ఇడియట్స్' లోనూ ఈ మానవ రహిత విమానం కనిపిస్తుంది. దీనిపై ఢిల్లీ పోలీసు అధికారులు స్పందిస్తూ, తమ అవసరాలకు అనుగుణంగా వీటికి మార్పులు చేర్పులు చేయాలని తయారీదారులను కోరామని తెలిపారు. ఈ డ్రోన్లను ఢిల్లీ పోలీసు విభాగం నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఉపయోగించనుంది.

  • Loading...

More Telugu News